హైదరాబాద్ : పోలీసులను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman )ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందస్తు అక్రమ అరెస్ట్‌లపై మండిపడ్డారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి నివాసంలో పోలీసులు బాల్క సుమన్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుందని, పోలీసులతో నిర్బంధ రాజ్యం నడుపుతుందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరన్నారు. రాబోయే కాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మరోవైపు ఆదిలాబాద్‌లో జోగు రామన్న, ఖానపూర్లో కోవలక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.