డిచ్పల్లి, మే 11 : బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజ య్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండల కేంద్రం లో విలేకరులతో మాట్లాడారు. బాధితురాలైన మైనర్‌కు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. భగీరథ్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో విచారణ పేరుతో బాలికకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. బాధితురాలికి అండగా నిలువాల్సిన పోలీసులు, నిందితుడిని రక్షించేలా వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. బాధిత కుటుంబాన్ని బెదిరించిన ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బీఆర్ఎస్ నాయకులు పద్మారావు, దాసరి లక్ష్మీనర్సయ్య, సర్పంచులు యూసుబ్, యాదగిరి పాల్గొన్నారు.