శంషాబాద్ రూరల్: బహదూర్‌గూడలోని భూముల చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు అడ్డుకున్నారు. బహదూర్‌గూడలో 650 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినట్లు పేర్కొంటున్న అధికారులు.. మిగతా భూములు నిజమైన పట్టాదారులకు కొత్త పాస్‌బుక్కులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తహీల్దార్ కార్యాలయంలో అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త పాస్ బుక్కులు ఇవ్వలేదు.
శనివారం అధికారులు వారి సిబ్బంది భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి వచ్చారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని హైడ్రా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు వెనుదిరిగి పోవాలని లేదంటే ఊరుకోమని హెచ్చరించారు. దీంతో హైడ్రా అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. రైతులకు న్యాయం చేయకుండా భూములను సర్వే చేసిన, భూములను లాక్కోవడం కోసం యత్నించిన ఊరుకోమని అన్నారు.