వాపి, డిసెంబర్ 22: రాజకీయాల్లో వెన్నుపోటు కామన్.. కానీ, ఆ పోటు ఇంట్లోవాళ్లే పొడిస్తే! అంతకుమించిన దగా మరోటి ఉండదు. ఇలాంటి దారుణ వెన్నుపోటు ఓ సర్పంచ్ అభ్యర్థికి ఎదురైంది. ఎంతలా అంటే ఇంట్లో 12 మంది ఓటర్లు ఉన్నా ఒక్కరూ ఓటెయ్యలే! ఆయనకు వచ్చింది ఒక్క ఓటే. అది కూడా తాను వేసుకున్నదే! గుజరాత్లోని వాపి జిల్లా చార్వాలా గ్రామానికి చెందిన సంతోష్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేశాడు. ఇంట్లో 12 మంది ఉన్నారు.. ఊళ్లో మంచి పేరు ఉన్నదని భావించి అతడు ఎన్నికల బరిలో నిలిచాడు. మంగళవారం కౌంటింగ్ కేంద్రం వద్ద ఫలితం కోసం ఆసక్తిగా చూశాడు. తనకు ఒక్క ఓటే పడటంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుమిలికుమిలి ఏడ్చాడు.