సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 5: టీకా వికటించి 45 రోజుల వయసున్న శిశువు మృత్యువాత పడింది. ఈ ఘటన బుధవారం తంగెనపల్లి మండలం నేరెళ్లలో చోటుచేసుకుంది. చిన్నారి మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. మృతి చెందిన శిశువుతో నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన దాసరి రమేష్ – లలిత దపతులకు ఆడ శిశువు
(45) కలదు. పసికందుకు బుధవారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా ఇప్పించారు.
గంట తర్వాత చిన్నారికి జ్వరం రావడంతో పాపను సిరిసిల్ల హాస్పిటల్కు తీసుకువెళ్లడంతో వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. అనంతరం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని దవాఖానా ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఏస్ఐ రామ్మోహన్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి సముదాయించారు.