హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆఫీసులో దసరా పండుగను పురస్కరించుకొని, ఆయుధ పూజ నిర్వహించారు. ఆయుధాలతో పాటు వాహన పూజ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీపీ శివకుమార్, డీఐజీ టాఫ్సర్ ఇక్బాల్, ఎస్పీలు ఎన్వీ కిషన్ రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.