Kangana Ranaut: అయోధ్య నగరం పెండ్లి కూతురులా ముస్తాబయ్యిందని నటి కంగనా రనౌత్ అభివర్ణించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రామ భజనలు, యజ్ఞాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే దేవలోకానికి వచ్చిన అనుభూతి కలుగుతున్నదని అన్నారు. ఆహ్వానించినా అయోధ్యకు రావడం ఇష్టంలేని వారి గురించి తానేమీ మాట్లాడనని అన్నారు.
‘అయోధ్య నగరం ఒక పెండ్లి కూతురులా ముస్తాబయ్యింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భజనలు, యజ్ఞాలు జరుగుతున్నాయి. మనం దేవలోకానికి వచ్చామా..? అనే అనుభూతి కలుగుతున్నది. అయోధ్యకు రావడం ఇష్టంలేని వారి గురించి మనమేమీ మాట్లాడలేం. ఇప్పుడు అయోధ్యలో ఉండటం నిజంగా చాలా బాగుంది’ అని కంగనా రౌత్ చెప్పారు.
అయోధ్యలో రేపు జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు కంగనా రనౌత్ అక్కడికి వెళ్లారు. తమిళనాడు నుంచి కూడా సూపర్‌స్టార్ రజినీకాంత్, యంగ్ హీరో ధనుష్ ఆయోధ్యకు బయలుదేరారు.
#WATCH | Ayodhya: Actress Kangana Ranaut says “Ayodhya has been decorated like a bride. Bhajans and Yagya are being organised at several places. It feels like we have reached ‘Dev Lok’…We cannot say anything about those who do not want to come…It feels really good to be in… pic.twitter.com/3CgfCw3owJ
— ANI (@ANI) January 21, 2024