సైబర్ వలలో పడొద్దు
- ఆన్లైన్ మోసాలపై అవగాహన
- సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచన
- ఫలిస్తున్న విద్యా, పోలీస్ శాఖ, షీ టీమ్స్ల ప్రయోగం

జూబ్లీహిల్స్, నవంబర్24: విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియోగిస్తూ సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని షీ టీమ్ ప్రతినిధులు సూచించారు. బుధవారం యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతినిధులు పరమేశ్వరి, సరిత, సాయి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఫోన్లు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతరులతో చాటింగ్, వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు షేర్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ హెచ్ఎం నరసింహ, సైబర్ మెంటర్ ప్రభాకర్, స్టూడెంట్ అంబాసిడర్స్ మేఘన, మల్లేశ్, తిబిత, విజయలక్ష్మి, మధుసూదన్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.
బన్సీలాల్‌పేట్‌లో..
బన్సీలాల్‌పేట్, నవంబర్ 24: సమాజంలో జరుగుతున్న నేరాలను నాటక, ప్రదర్శనల ద్వారా ‘సైబర్ కాంగ్రెస్’ శిబిరాలు ఏర్పాటుచేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యా, పోలీస్ శాఖ, షీ టీమ్స్, మహిళా రక్షణ విభాగం సమన్వయంతో యంగిస్తాన్ ఫౌండేషన్ స్వచ్ఛం ద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగరంలోని ఎంపిక చేసిన 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైబర్ అంబాసిడర్ పేరుతో ఈ శిబిరాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం న్యూబోయిగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ శిబిరం ఏర్పాటుచేశారు. ఆన్లైన్ మోసాలు, స్మార్ట్ఫోన్ల ద్వారా చాలా మంది తమ డబ్బును పోగొట్టుకుంటున్నారని, మరోవైపు ఆడపిల్లలు, మహిళలు అమర్యాద పూర్వకమైన వేధింపులకు గురవుతున్నారని వక్తలు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

