న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కారణంగా గతేడాది వాయిదాపడిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం-2020 సోమవారం ఢిల్లీలో జరిగింది. 74 మందికి ప్రకటించిన అవార్డులను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అందించారు. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును భారత మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ (హాకీ), వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్), తంగవేలు మరియప్పన్ (పారా అథ్లెటిక్స్) స్వీకరించారు. అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్‌శెట్టి అర్జున అవార్డు అందుకున్నారు. వీరితో పాటు ద్యుతీచంద్, లవ్లీనా బొర్గోహై, ఇషాంత్‌శర్మ, దీప్తిశర్మ, మనుభాకర్, సౌరభ్ చౌదరీ అర్జున పురస్కారాలు పొందారు. మొత్తంగా ఐదుగురికి ఖేల్త్న్ర, 27 మందికి అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్, టెన్జింగ్ నార్వే, మౌలానా అబుల్ కలామ్ అజాద్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అవార్డులను విజేతలు మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.