హన్వాడ : కాంగ్రెస్ ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధును (Rythu Bandhu) ఎగవేసి స్థానిక ఎన్నికల తరుణంలో రైతుబంధు వేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Former Minister Srinivas Goud ) ఆరోపించారు. శుక్రవారం బీఆర్ఎస్ మండల సమావేశం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం హయాంలో భూముల రేట్లు పెరుగగా , కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో రేట్లు పడిపోయాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు రూ. 4,000 పింఛన్, తులం బంగారం , 2 లక్షల రుణమాఫీ, మహిళలకు రూ. 2,500 తో పాటు మరికొన్ని హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు.
కాంగ్రెస్ను నమ్మి ప్రజలు మోసపోయాయని, వచ్చే స్థానిక ఎలక్షన్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తామన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీకి చెందిన పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కర్ణాకర్ గౌడ్, కార్యదర్శి శివకుమార్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.