శక్కర్ నగర్ : నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా బోధన్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ ( BSP ) సమావేశంలో పలువురు ఆ పార్టీలో చేరారు. బోధన్ పట్టణానికి చెందిన ఆటో యూనియన్ నాయకుడు విఖార్తో పాటు పలు వార్డులకు చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీలకు చెందిన సుమారు 30 మంది బీఎస్పీలో చేరారు.
వీరికి పార్టీ నాయకులు రవికుమార్, జిల్లా అధ్యక్షుడు సిగాడే పాండు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, మైనార్టీల కోసం పనిచేస్తున్న బహుజన సమాజ్ పార్టీలో తాము చేరామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిరివేసు సంతోష్ నాయకులు దాడి రమేష్, శ్యామ్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.