Mitchell Starc : టీ 20 ఫార్మాట్ వచ్చాక ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ఎవరు చూస్తారని చాలామంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. టెస్ట్ క్రికెట్ అసలైన క్రికెట్ అన్నవాళ్లూ ఉన్నారు. విరాట్ కోహ్లీని చూశాక టెస్ట్ క్రికెట్లోనే అసలైన మజా ఉందని కొందరు మాజీలు అన్నారు. తాజాగా ఆ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ చేరాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే విజయం అనంతరం స్కార్ట్ మాట్లాడుతూ.. తన మొదటి ప్రాధాన్యం టెస్ట్ ఫార్మాట్‌కే అని స్టార్క్ తెలిపాడు.
‘నామొదటి ప్రాధాన్య టెస్ట్ క్రికెట్‌కే. ఆ తర్వాతే వన్డే, టీ 20లు. ఎందుకంటే.. వన్డేలు, టీ 20ల కంటే టెస్ట్ ఫార్మాట్ ఎంతో ఉన్నతమైంది. మూడు ఫార్మాట్లలో ప్రతి మ్యాచ్ ఆడడం ఏ ఆటగాడికైనా అసాధ్యం. శరీరం సహకరించినంత వరకు వన్డేలు, టీ 20లు ఆడతాను. అయితే.. ‘ అని స్కార్ట్ అన్నాడు.
తీరక లేని షెడ్యూల్ కారణంగా స్టార్క్ టెస్ట్ ఫార్మాట్‌కే మొదటి ఓటు వేశాడు. అయితే, అతను ఇప్పట్లో వన్డేలు, టీ 20లకు గుడ్ బై చెప్పాలనుకోవడం లేడు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్ కీలక ఆటగాడు. అంతేకాదు తనకు 2024 పొట్టి ప్రపంచకప్ ఆడాలని ఉందని స్కార్ట్ వెల్లడించాడు.