కొలంబో : టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ వేటను ఆస్ట్రేలియా ఘన విజయంతో ఆరంభించింది. కొలంబో వేదికగా పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో కంగారూలు.. 67 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేశారు. బ్యాటింగ్‌లో భారీ స్కోర్లేమీ నమోదుకాకపోయినా మార్కస్ స్టోయినిస్ (29 బంతుల్లో 45, 2 ఫోర్లు, 1 సిక్స్), జోష్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 37, 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఛేదనలో ఐర్లాండ్.. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లీస్ (4/12), ఆడమ్ జంపా (4/23) ధాటికి 16.5 ఓవర్లలో 115 రన్స్‌కే చేతులెత్తేసింది. ఆ జట్టులో డాక్రెల్ (29 బంతుల్లో 41, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ గాయంతో దూరమవడంతో ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.