మకే: తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో ఘోరంగా తడబడింది. శనివారం మొదలైన ఈ మ్యాచ్లో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (6/12) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 34 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది.
తొలి బంతికే వికెట్ల ఖాతా తెరిచి.. 22 బంతుల్లోనే ఐదు వికెట్ల హాల్ సాధించిన స్టార్క్ ధాటికి బంగ్లా టాప్-6 బ్యాటర్లలో నలుగురు సున్నా చుట్టారు. చివరి బ్యాటర్ షోరిఫుల్ ఇస్లాం (14) టాప్ స్కోరర్. అనంతరం ఆసీస్ 40 ఓవర్లలో 165/8 స్కోరుతో తొలి రోజు ముగించింది. గ్రీన్ (51 బ్యాటింగ్), స్మిత్ (42) రాణించారు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ (6/35) ఆరు వికెట్లు తీశాడు.