దుగ్గొండి : అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ తగాదాల నేపథ్యంలో సురేందర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్ గ్రామానికి చెందిన గట్ల సురేందర్ అనే వ్యక్తి సోమవారం ఉదయం వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణం లో ఒంటిపై పెట్రోల్ ఒంటి పై పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు.
వెంటనే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సురేందర్ దగ్గర ఉన్న పెట్రోల్ బాటిల్ లాక్కుంది. అనంతరం కలెక్టరేట్ లో ప్రజావాణి లో ఉన్న కలెక్టర్ సత్య శారద దగ్గరకు పోలీసులు సురేందర్ ను తీసుకెళ్లారు. మీ అన్న దమ్ముళ్ల భూ వివాదం కోర్టులో ఉందని, మీరు ఇలా పెట్రోల్ పోసుకుని బెదిరివ్వడం సరైన పద్ధతి కాదని ఏదైనా ఉంటే కోర్టు ద్వారానే తేల్చుకోవాలని సూచించారు.