దహెగాం, నవంబర్ 21 : కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని, హత్యలు కూడా జరుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఇటీవల హత్యకు గురైన శ్రావణి కుటుంబాన్ని పరామర్శించారు. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రెకు వెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
సర్కారు నుంచి అందాల్సిన సాయం గురించి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఆర్థికసాయం అందించారు. హంతకులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ వర్గానికి చెందిన మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ మంత్రి లక్ష్మణ్ నెలరోజులైనా స్పందించకపోవడం శోచనీయమని విమర్శించారు.