అమరావతి : వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) పై దాడి, హత్యాయత్నంపై వైసీసీ కేంద్ర హోంశాఖకు( Union Ministry ) ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ లేఖ రాసిందని సీనియర్ నాయకుడు, వైసీపీ పార్లమెంటరీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి ( YV Subbareddy ) వివరాలను వెల్డించారు. అంబటిపై టీడీపీ గూండాల దాడి, అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, ఫలితంగా అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగి ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఏపీలో శాంతి భద్రతల పునరుద్ధరణకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరినట్లు వివరించారు. ఏపీలో పరిస్థితులు మరింత దిగజారకుండా తగిన చర్యలు తీసుకోవాలనికోరారు.