Income Tax | వేతన జీవులకు నిరాశ.. ఆదాయ పన్ను తగ్గింపు లేనట్టే..
Income Tax | ఆదాయపు పన్ను (Income Tax) తగ్గింపు కోసం ఆశగా ఎదురుచూసిన వేతన జీవులను ఈ బడ్జెట్ నిరాశపర్చింది. ఈ బడ్జెట్లో (Union Budget - 2026 ) ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) కొత్తగా పన్ను మినహాయింపులు ఏమీ ప్రతిపాదించలేదు. అయితే విధానపరమైన అంశాల్లో మాత్రం ఊరట లభించింది.
Income Tax : ఆదాయపు పన్ను (Income Tax) తగ్గింపు కోసం ఆశగా ఎదురుచూసిన వేతన జీవులను ఈ బడ్జెట్ నిరాశపర్చింది. ఈ బడ్జెట్లో (Union Budget – 2026 ) ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) కొత్తగా పన్ను మినహాయింపులు ఏమీ ప్రతిపాదించలేదు. అయితే విధానపరమైన అంశాల్లో మాత్రం ఊరట లభించింది.
ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్‌కు జూలై 31 వరకు గడువు ఇచ్చారు. అదేవిధంగా నాన్ ఆడిట్ బిజినెస్‌లు, ట్రస్ట్‌ల ఐటీ ఫైలింగ్‌కు ఆగస్టు 31 వరకు గడువు పెంచారు. రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్స్‌ల దాఖలుకు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. ఇక 2025లో ప్రతిపాదించిన ఆదాయపుపన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి వాస్తవరూపం ధరించనున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
రికార్డ్ సమయంలో ఈ ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను పూర్తి చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందులో ఆదాయపు పన్ను నిబంధనలను మరింత సరళతరం చేసినట్లు చెప్పారు. కొత్త చట్టాన్ని త్వరలోనే నోటిఫై చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులు, కొత్త చట్టాన్ని అర్థం చేసుకోని వారికి తగినంత సమయం ఇస్తామన్నారు. ఇక కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) లో కీలక మార్పులు చేసింది. ఫ్యూచర్స్ మీద ఈ పన్నును 0.02 నుంచి 0.05 శాతానికి, ఇక ఆప్షన్స్ ప్రీమియంపై పన్నును 0.15 శాతానికి పెంచింది. షేర్ల బైబ్యాక్‌లను క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణించి పన్ను విధిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. విద్యార్థులు, టెక్ ప్రొఫెషనల్స్, రీ లొకేటెడ్ ఎన్నారైల వంటి చిన్న పన్ను చెల్లింపుదార్ల కోసం ఆరునెలలపాటు ఫారిన్ అసెట్స్ డిస్క్లోజర్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు.
ఎన్నారైల ఆస్తుల విక్రయంపై టీడీఎస్ కోసం కొత్త నిబంధన తీసుకొచ్చారు. స్థిరాస్తి విక్రయాలపై స్థానిక కొనుగోలుదారుల నుంచి టీడీఎస్ వసూలు చేస్తారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ (ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్-TCS) ను 5%, 20% నుంచి 2శాతానికి కుదించారు. మోటార్ యాక్సిడెంట్లలో వచ్చే క్లెయిమ్‌లపై ఆదాయపన్నును ఎత్తివేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

