అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ( Andhra Pradesh) దారుణం జరిగింది. అత్త, మామ(Uncle), భార్యపై ( Aunt) అల్లుడు కత్తితో దాడి చేయగా అత్త, మామ చనిపోగా భార్యకు తీవ్రగాయాలైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నల్లజర్ల మండలం ఘంటావరిగూడెంలో 12 ఏండ్ల క్రితం రామకోటేశ్వరరావు, నాగేశ్వరికి వివాహం జరిగింది.
ఏడాది క్రితం నుంచి నాగేశ్వరి పుట్టింటిలో ఉంటుంది. తన గ్రామానికి రావాలని రామకోటేశ్వరరావు అనేక సార్లు కోరినా పట్టించుకోలేదు. దీంతో మామ బాబురావు(50), అత్త శారద( 45)ను అల్లుడు కత్తితో దాడిచేసి చంపివేశాడు. అడ్డువచ్చిన భార్య నాగేశ్వరిపైనా కత్తితో దాడిచేసి పారిపోయాడు. నల్లజర్ల పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.