Athadu | సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం అతడు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే పదానికి ఓ పర్యాయపదం అయిపోయిన చిత్రం అతడు కాగా, ఈ చిత్రం 2005లో విడుదలైంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ అత్యంత ప్రజాదరణ పొందింది. ‘అతడు’.. మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఫీలింగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. టెలివిజన్ చరిత్రలో మాత్రం ‘అతడు’ సినిమా.. ఎవరూ రిపీట్ చేయలేని కనీసం టచ్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేసింది.
టీవీలో ఏకంగా 1500 సార్లు ఈ చిత్రం టెలికాస్ట్ కాగా, ప్రతి సారి అదిరిపోయే టీఆర్పీ సాధిస్తూ వచ్చింది.ఇప్పటివరకూ త్రివిక్రమ్ తీసిన చిత్రాల్లో ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగానే గొర్చొచ్చే చిత్రం ఇది. అతడు చిత్రం మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరి చేసింది.. నందు అనే పాత్రని తమ ఇంట్లో మనిషిగా ప్రతి తెలుగువాడు ఫీలయ్యేలా చేసింది అతడు చిత్రం. బ్రహ్మానందం లాంటి బాబాయ్, నాజర్ లాంటి తాతయ్య, సుధ లాంటి అత్త, త్రిష లాంటి మరదలు, సునీల్ లాంటి ఫ్రెండ్ మా ఇంట్లో లేరేంట్రా బాబూ అని ప్రతి కుర్రాడు ఫీలయ్యేలా చేసింది అతడు చిత్రం
తెలుగులో 2005లో వచ్చిన అన్ని చిత్రాల్లో కంటే ఈ చిత్రమే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం గా నిలిచింది. ఈ చిత్రం హిందీ బెంగాలీ లోను రీమేక్ అయింది. ఇందులో మహేష్ బాబు, త్రిష మధ్య సీన్ చాలా మందికి నచ్చేసింది. త్రిష బట్టలు మడత పెట్టి వెళుతున్నప్పుడు కుర్చీలో కూర్చొని మహేష్ బాబు కాలు అడ్డుపెట్టి పడేస్తాడు. ఆ సీన్ అప్పట్లో చాలా మందికి నచ్చేసింది. ఇక ఈ సీన్‌ని ఇద్దరు పిల్లలు రీ క్రియేట్ చేశారు. అచ్చం మహేష్ బాబు, త్రిష మాదిరిగా ఆ చిన్నారుల పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఈ చిన్నారులు పిల్లలు కాదు పిడుగులు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Pardhu 💕 poori #Athadu4K #Maheshbabu pic.twitter.com/7F27atMRfb
— Ravulapalem_MBFC™ (@RavulapalemMBFc) April 12, 2025