Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
Assembly Elections | ఐదు రాష్ట్రాల (Five states) అసెంబ్లీ ఎన్నికల (Assembly Eelctions) నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Centrel Election Commission) కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh), పంజాబ్ (Punjab), ఉత్తరాఖండ్ (Uttarakhand), మణిపూర్ (Manipur), గోవా (Goa) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను రానున్న జనవరిలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Assembly Elections : ఐదు రాష్ట్రాల (Five states) అసెంబ్లీ ఎన్నికల (Assembly Eelctions) నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Centrel Election Commission) కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh), పంజాబ్ (Punjab), ఉత్తరాఖండ్ (Uttarakhand), మణిపూర్ (Manipur), గోవా (Goa) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను రానున్న జనవరిలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రకటనకు ముందు, ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఈసీ పూర్తిస్థాయి బెంచ్ పర్యటించనుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లతో కూడిన ఫుల్ బెంచ్ నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్లో తమ పర్యటనలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పర్యటనల సందర్భంగా రాష్ట్రాల క్షేత్రస్థాయి పరిస్థితులను, ఎన్నికల సన్నద్ధతను సమీక్షిస్తారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో ఈసీ ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరిస్తుంది.
ఇప్పటికే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ స్థాయి బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటించి సన్నాహక పనులను సమీక్షించాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఈ బృందాల పర్యటనలు పూర్తయ్యాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఒక దఫా పర్యటన ముగియగా, మరో రెండు పర్యటనలు జరగాల్సి ఉంది. గోవాలో డీఈసీ బృందం ఇంకా పర్యటించలేదు. నవంబర్ నెలాఖరు నాటికి ఈ బృందాలు తమ నివేదికలను ఎన్నికల సంఘానికి సమర్పించనున్నాయి.
పోలింగ్‌ను ఎన్ని దశల్లో నిర్వహించాలనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తున్నది. అయితే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. జనాభాపరంగా, భౌగోళికంగా పెద్దదైన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం బహుళ దశల్లో ఎన్నికలు నిర్వహించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రాల్లో పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, అధికారుల అభిప్రాయాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాత షెడ్యూల్‌పై ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్‌లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

