సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన యాక్షన్ ఎంటైర్టెనర్ ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. శంకర్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న విడుదల కానుంది. డివైన్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా రూపొందిందనీ, ప్రశాంత్‌వర్మ కథ, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. వారణాసి మానస కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: నల్లపనేని యామిని, నిర్మాణం: లలితాంబిక ప్రొడక్షన్స్.