పైపులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆశీర్వాద్ నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం ఈ రంగంలోకి అడుగుపెట్టిన సంస్థ అనతికాలంలోనే అగ్రగామి కంపెనీగా ఎదిగింది. బెంగళూరు కేంద్రస్థానంగా 1998లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సంస్థ దేశవ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించింది.
మొదటి ఏడాది నాలుగు కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన సంస్థ..ప్రస్తుతం వెయ్యి కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. 2013లో తన మార్కెట్‌ను అంతర్జాతీయంగా విస్తరించు కోవడానికి అలియాక్సిస్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నది. ఇదే క్రమంలో 2018లో అలియాక్సిస్ గ్రూపులో అంతర్భాగమైంది. ఇప్పటికే బెంగళూరు, భీవండిలో పైపుల ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ.. రూ.500 కోట్ల తో అత్యాధునిక తయారీ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
