Rohit Sharma : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వీడ్కోలు వార్తలకు చెక్ పెడుతూ లార్డ్స్‌లో శతకంతో చెలరేగాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన హిట్‌మ్యాన్ అర్ధ శతకం తర్వాత జోరు పెంచి సెంచరీ సాధించాడు. రషీద్ ఓవర్లో బౌండరీతో వన్డేల్లో 34వ వంద కొట్టేశాడీ ఓపెనర్. అంతేకాదు పర్యాటక జట్టు ఆటగాడిగా ఇంగ్లండ్‌పై అత్యధిక శతకాల రికార్డును సొంతం చేసుకున్నాడీ బ్యాటర్. వన్డే ఫార్మాట్లో లార్డ్స్‌లో వంద కొట్టిన మొదటి భారత క్రికెటర్ రోహితే కావడం విశేషం.
లార్డ్స్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చిరస్మరణీయ శతకం సాధించాడు. వరసగా రెండు మ్యాచుల్లో విఫలమవ్వడం, ఓవైపు వీడ్కోలు ఒత్తిడి.. ఈ రెండింటి చిత్తు చేయాలని క్రీజునంటుకున్న రోహిత్ వన్డేల్లో 34వ సెంచరీతో రెచ్చిపోయాడు. మూడంకెల స్కోర్ అందుకోగానే లార్డ్స్ బాల్కనీలో కూర్చుకున్న కోచ్ గౌతం గంభీర్ వైపు బ్యాట్ చూపిన హిట్‌మ్యాన్.. సంబురాలు మాత్రం చేసుకోలేదు. 388 పరుగుల ఛేదనలో జట్టును గెలిపించే బాధ్యత మిగిలే ఉంది కాబట్టి.. అతడు హెల్మెట్ కూడా తీయకుండా బ్యాట్ పైకి ఎత్తాడంతే.
Some things simply never change 🤌
A flawless 5️⃣0️⃣-run stand for Rohit & Kohli in their 4️⃣0️⃣0️⃣th international appearance together 👏
Updates ▶️ https://t.co/pLZ2PvDH5G#TeamIndia | #ENGvIND | @ImRo45 | @imVkohli pic.twitter.com/oQFZYUNZ6k
— BCCI (@BCCI) July 19, 2026
Some things simply never change 🤌
A flawless 5️⃣0️⃣-run stand for Rohit & Kohli in their 4️⃣0️⃣0️⃣th international appearance together 👏
Updates ▶️ https://t.co/pLZ2PvDH5G#TeamIndia | #ENGvIND | @ImRo45 | @imVkohli pic.twitter.com/oQFZYUNZ6k
— BCCI (@BCCI) July 19, 2026
ఇక.. ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అతడికిది 8వ సెంచరీ. దాంతో, అత్యధిక శతకాలు బాదిన పర్యాటక ఆటగాడిగా అవతరించాడు హిట్‌మ్యాన్. ఇంగ్లండ్పే ఏడేసి సెంచరీలతో సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్, క్వింటన్ డికాక్, ఏబీ డివిలియర్స్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.