IND vs SA : మూడో టీ20లో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు తోకముడిచారు. ముల్లనూర్‌లో దంచేసిన క్వింటన్ డికాక్ (0) సహా ప్రధాన ఆటగాళ్లంతా అర్ష్‌దీప్ సింగ్ (2-13), హర్షి్త్ రానా(2-34)ల విజృంభణతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(2-11) తిప్పేయగా 69కే ఆరు వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(61) అర్ధ శతకంతో రాణించాడు. ఆఖరి ఓవర్లో కుల్దీప్ యాదవ్(2-12) రెండు వికెట్లు తీయగా సఫారీ టీమ్ 117కే ఆలౌటయ్యింది.
ముల్లనూర్‌లో ఊహించని ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టుట మూడో టీ20లో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. టాస్ ఓడిన ప్రత్యర్దిని వణికిస్తూ.. ఆదిలోనే టాపార్డర్‌ను కుప్పకూల్చారు భారత బౌలర్లు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్(0)ను అర్ష్‌దీప్ సింగ్ (2-13)వెనక్కి పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డేంజరస్ క్వింటన్ డికాక్(0)ను హర్షిత్ రానా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. తన రెండో ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్(2)ను ఔట్ చేసి సఫారీలను కష్టాల్లోకి నెట్టాడు రానా.
Innings Break!
A terrific collective show by the #TeamIndia bowlers 👌
Chase on the other side ⏳
Scorecard ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/wLjHQjkyfO
— BCCI (@BCCI) December 14, 2025
మూడు వికెట్లు పడడంతో కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(61), ట్రిస్టన్ స్టబ్స్(9) జట్టును ఆదుకోవాలనుకున్నారు. కానీ, స్టబ్స్‌ను ఔట్ చేసిన పాండ్యా సఫారీలు ఒత్తిడిలో పడేయడమే కాదు టీ20ల్లో వంద క్లబ్లో చేరాడు. అనంతరం వచ్చిన డొనొవాన్ ఫెరీరా(20) బౌండరీలతో స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, అతడిని వరుణ్ చక్రవర్తి క్లీన్‌బౌల్డ్ చేశాడు. అంతే.. 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా.. మార్కో యాన్సెన్(2) ఉండడంతో సఫారీలు ధైర్యంగానే ఉన్నారు.
కానీ, ఈ పొడగరి ఆల్‌రౌండర్‌ను వరుణ్ బౌల్డ్ చేసి ప్రొటిస్ టీమ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ప్రధాన బ్యాటర్లు ఔట్ కావడంతో మర్క్రమ్ ఒంటరి పోరాటం చేశాడు. డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడిన అతడు.. అర్ధ శతకంతో స్కోర్ వంద దాటించాడు. కానీ, ధాటిగా ఆడే క్రమంలో అర్ష్‌దీప్ ఓవర్లో వికెట్ కీపర్ జితేశ్ చేతికి చిక్కాడు. 20వ ఓవర్లో కుల్దీప్ రెండు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా 117కే కుప్పకూలింది.
2⃣ wickets in an over! 👏
Birthday boy Kuldeep Yadav caps things off in style for #TeamIndia with ball in his 5⃣0⃣th T20I match! 🙌
Updates ▶️ https://t.co/AJZYgMA9ms#INDvSA | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/IC9dRjEeBV
— BCCI (@BCCI) December 14, 2025