మాజీ మేయర్ రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి
చర్లపల్లి, నవంబర్ 20 : అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. చర్లపల్లి డివిజన్‌కు చెందిన పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు శనివారం మాజీ మేయర్, కార్పొరేటర్లను కలిశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు చర్లపల్లిలోని చర్చిల వద్ద ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ఉన్న చర్చిల వద్ద సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, ముఖ్యంగా వచ్చే నెలలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక నిధులు కేటాయించి.. చర్చిల వద్ద అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. అనంతరం పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.