Military Camp | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లోని మిలిటరీ క్యాంప్ (Military Camp)లో జరిగిన కాల్పుల ఘటనలో ఓ ఆర్మీ అధికారి (Army Officer) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సాంబా (Samba) జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
బారి బ్రాహ్మణ క్యాంప్ (Bari Brahmana camp)లో మంగళవారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనలో ఏదైగా ఉగ్రకోణం ఉందా అనేది తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటన తర్వాత అదే క్యాంప్‌లోని ఓ జవాన్ కొన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పారిపోయినట్లు సమాచారం. అతని కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.
Also Read..
Jammu and Kashmir | చలి తీవ్రతకు వణుకుతున్న కశ్మీర్.. విపరీతంగా మంచు.. పడిపోయిన ఉష్ణోగ్రతలు
Nitin Gadkari | ఢిల్లీలో మూడు రోజులు ఉంటే.. అలర్జీలు వచ్చాయి : నితిన్ గడ్కరీ
Indian Nationals | అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్