Armed Reserve Mobilization | రాంనగర్, ఫిబ్రవరి 20 : ప్రతీ ఏటా ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు ఇచ్చే శిక్షణలో భాగంగా నిర్వహించే వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం ఇవాళ ముగిసింది. పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ డీ మొబిలైజేషన్ పరేడ్‌లో సాయుధ బలగాల పోలీసులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తినపుడు వాటిని అదుపు చేయుటకు ముఖ్యంగా ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల సేవలు వినియోగించుకుంటామన్నారు. ఈ మొబిలైజేషన్లో భాగంగా సాయుధ బలగాల పోలీసులకు, విధులకు సంబందించిన ఆర్మ్ డ్రిల్, వెపన్ డ్రిల్, పరేడ్ , మాబ్ ఆపరేషన్, వెపన్ ఫైరింగ్ మొదలగు అన్నీ అంశాల్లో 20 రోజుల పాటు శిక్షణ అందించామన్నారు.
శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధుల్లో కనబరుస్తూ మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, జానీ మియా, శ్రీధర్ రెడ్డి, సురేష్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!