వేములవాడ టౌన్, జనవరి 5 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విశ్రాంత స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్శర్మ (65) సోమవారం కన్నుమూశారు. 45 ఏండ్లుగా రాజన్న ఆలయంలో అర్చకుడిగా, ప్రధానార్చకుడిగా, స్థానాచార్యుడిగా విధులు నిర్వర్తించిన ఆయన, నిరుడు ఉద్యోగ విరమణ చేశారు.
కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన సోమవారం మృతి చెందినట్టు అతని బంధువులు తెలిపారు. ఆయన మృతికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రతాప రామకృష్ణ, రాజన్న ఆలయ ఈవో రమాదేవి తదితరులు సంతాపం తెలిపారు.