RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
RTC EU | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎంప్లాయీస్ యూనియన్ కూటమి నాయకత్వానికి ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TS RTC ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతున్న కూటమితో తలపడి ఘనవిజయం సాధించిన ఎంప్లాయీస్ యూనియన్ (EU )కూటమి నాయకత్వానికి ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ అభినందనలు ( Congratulates ) తెలిపింది. అధికార బలం కంటే కార్మికుల విశ్వాసమే గొప్పదని తెలంగాణలో ఎన్నికలు నిరూపించాయని ఇ.యు. రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు( Damodara Rao ), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య ( GV Narsaiah ) అన్నారు.
కార్మికుల ప్రయోజనాల కోసం నిజాయితీతో, నిబద్ధతతో సాగించే పోరాటాలకే ఉద్యోగులు పట్టం కడతారని తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించడంలో కీలక పాత్ర పోషించామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ ఆర్టీసీ ప్రభుత్వ విలీన లక్ష్యాన్ని ఇ.యు. నాయకత్వంలో సాధించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ విజయం కేవలం ఒక సంఘానిది కాదని, కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాలకు లభించిన విజయమని అభివర్ణించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంస్థల పరిరక్షణకు, ఉద్యోగుల హక్కుల సాధనకు ఎంప్లాయీస్ యూనియన్ల నాయకత్వం పరస్పర సహకారంతో నిరంతరం కృషిచేస్తుందని వారు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

