Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Gautam Gambhir | ఈ రాత్రికి భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లనున్నారు. తొలి రెండు మ్యాచ్‌లలో చెరో మ్యాచ్ గెలువడంతో ప్రస్తుతం ఇరుజట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మహాకాళేశ్వరుని దర్శనం చేసుకున్నారు.
Gautam Gambhir : ఈ రాత్రికి భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లనున్నారు. తొలి రెండు మ్యాచ్‌లలో చెరో మ్యాచ్ గెలువడంతో ప్రస్తుతం ఇరుజట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మహాకాళేశ్వరుని దర్శనం చేసుకున్నారు.
ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి పరమశివుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఆలయ సందర్శన అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడాడు. స్వామివారు తనను దర్శనానికి పిలిచారని, ఆయన ఆశీస్సులు తనకు, దేశానికి ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. తాము కచ్చితంగా రాణిస్తామని, దేవుడి ఆశీర్వాదం తమతోనే ఉంటుందని విశ్వసిస్తున్నానని ధీమా వ్యక్తంచేశారు.
అయితే గంభీర్, కోటక్ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో హోల్కర్ స్టేడియంలోనే జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు కూడా వారు అక్కడికి వెళ్లారు. ఆ పర్యటనలో ఇద్దరు కోచ్‌లు తెల్లవారుజామున జరిగే భస్మ హారతిలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు నంది హాల్లో కూర్చుని జట్టు విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంభీర్‌కు మహాకాళేశ్వరుడిపై అపారమైన భక్తి ఉందని, గతంలోనూ పలుమార్లు కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారని సన్నిహితులు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

