AP News | బొత్స ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం.. కేవలం ఒక్క ఎంపీపీ స్థానమే దక్కిన వైనం..!
AP News | వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎంపీపీ ఎన్నికల్లో గట్టి షాక్ తగలింది. ఆయన సొంత జిల్లా విజయనగరంలో పూర్తిగా అధికార తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. జిల్లాలోని మొత్తం 27 స్థానాలకుగానూ ఏకంగా 25 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు.
AP News : వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎంపీపీ ఎన్నికల్లో గట్టి షాక్ తగలింది. ఆయన సొంత జిల్లా విజయనగరంలో పూర్తిగా అధికార తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. జిల్లాలోని మొత్తం 27 స్థానాలకుగానూ ఏకంగా 25 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. కేవలం గరివిడిలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది.
జిల్లాలో ఆ పార్టీకి దక్కిన ఏకైక ఎంపీపీ స్థానం ఇదే. ఆ దక్కిన ఒక్క స్థానంలోనూ వైసీపీకి తలనొప్పి తప్పలేదు. తనకు వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపిస్తూ ఎంపీటీసీ సభ్యుడు బొంపల్లి వెంకటరావు రాజీనామా చేశారు. త్వరలో తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. భోగాపురం ఎంపీపీ ఎన్నిక కోరం లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది.
భోగాపురం ఎన్నిక వాయిదా పడిన విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ప్రొసీడింగ్ అధికారి ఎం రామారావు ప్రకటించారు. మరోవైపు గుర్ల ఎంపీపీ స్థానంలో సమానంగా సీట్లు రావడంతో లాటరీ తీశారు. దాంతో టీడీపీ అభ్యర్థి వెన్ని సన్యాసినాయుడు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇక విజయనగరం ఎంపీపీగా కోరాడ తులసి ఎన్నికయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొత్స ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం.. కేవలం ఒక్క ఎంపీపీ స్థానమే దక్కిన వైనం..!
Rajinikanth | మనవడితో రజినీకాంత్ స్టైలిష్ వాక్ అదిరిందంతే
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
రేపటి నుండి కోదాడలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
Exercises | ఇంట్లోనే కండరాల పెరుగుదలకు 7 వ్యాయామాలు.. ఇవి చేస్తే చాలు..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

