AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార కూటమి విజయపరంపర కొనసాగుతున్నది. విజయనగరం జిల్లాలోని బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన వైసీపీ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు.
AP News : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార కూటమి విజయపరంపర కొనసాగుతున్నది. విజయనగరం జిల్లాలోని బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన వైసీపీ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు. బొత్స అనూషపై టీడీపీ అభ్యర్థి పాశల నీరజ 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నీరజ విజయంతో బొండపల్లిలో కూటమి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.
జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ రేసులో ఉన్న అనూష ఓటమి పాలవడంతో వైసీపీ శ్రేణులు డీలాపడ్డాయి. కాగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి నలుగురు జడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలోకి దిగాలని ప్రయత్నించారు. పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి బొత్స తమ్ముడి కుమారుడు చైతన్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. బొండపల్లి నుంచి కుమార్తె అనుష, గరివిడి నుంచి కోడలు బొత్స పూజిత, గుర్ల మండలం నుంచి బొత్స సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి పోటీచేశారు.
గరివిడి జడ్పీటీసీగా బొత్స పూజిత విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి కిమిడి సంధ్యపై 1,599 ఓట్ల మెజార్టీతో పూజిత గెలుపొందారు. స్థానిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ స్థానం నుంచి విజయం సాధించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

