Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Agriculture Student | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లు తయారయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎంక్వైరీ జరిపించి.. వాళ్లను శాశ్వతంగా బహిష్కరిస్తే తప్ప ఈ యూనివర్సిటీ బాగుపడదని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Agriculture Student | మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థి రేవంత్ సర్కార్‌పై ఫైర్ అయ్యాడు.
యూనివర్సిటీ విద్యార్థి మాట్లాడుతూ.. ఈ ఘటన వెనుక ఒక సిండికేట్ బ్యాచ్ తయారైంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లు తయారయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ బ్రోకర్ల ముసుగులో ఉన్న ప్రొఫెసర్లను గుర్తించి వారిపై ఎంక్వైరీ జరిపించి.. వాళ్లను యూనివర్సిటీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తే తప్ప ఈ యూనివర్సిటీ బాగుపడదని డిమాండ్ చేస్తున్నామన్నారు.
మీరు ప్రొఫెసర్లా లేదంటే ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా.. ఈ యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని ఏం చేయడానికి వచ్చారు.. ఓయో రూంలుగా మారుస్తరా..? అని సదరు విద్యార్థి ఫైర్ అయ్యాడు. ఈ రోజు మా తోటి స్కాలర్స్ వచ్చి సార్ మాకు ఈ సమస్య ఉంది.. మాకు విద్యాబుద్దులు నేర్పించిన గురువుకే ఈ రకంగా మీరు శిక్షను విధిస్తే.. రేపు వచ్చే స్కాలర్లకు మీరు ఏ విధమైన దిశానిర్దేశం చేస్తరు.. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలని సూచించారు. ఈ విశ్వవిద్యాలయం పట్ల మీకు కొంచెం కూడా కనికరం ఉండదా..? సిండికేట్ బ్యాచ్ ఏదైతే ఉన్నదో తక్షణమే మీరు నైతిక విలువలు లేకుండా ప్రొఫెసర్లుగా కాకుండా వేరే రకంగా ప్రవర్తిస్తే మాత్రం మీ జీవితానికి ఎలాంటి అర్థం లేకుండా పోతుందని హెచ్చరించాడు.
వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య పక్కన ఒక సిండికేట్ బ్యాచ్ తయారైంది
ప్రొఫెసర్ల ముసుగులో కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు
ఈ ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తే తప్ప ఈ యూనివర్సిటీ బాగుపడదు
యూనివర్సిటీ భవనాలను ఓయో రూమ్‌లుగా మార్చారు
– యూనివర్సిటీ విద్యార్థి https://t.co/YaGg1Tr4l7
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

