Chevireddy Bhaskar Reddy | వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కాంలో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడికి సైతం బెయిల్ ఇచ్చింది.
వైసీపీ హయాంలో తీసుకొచ్చిన మద్యం పాలసీతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, అందులో చెవిరెడ్డి పాత్ర కూడా ఉందని సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది జూన్ 17వ తేదీన సిట్ అధికారులు చెవిరెడ్డిని బెంగళూరులో అరెస్టు చేశారు. అప్పట్నుంచి బెయిల్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రిజెక్ట్ చేశారు. తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చెవిరెడ్డికి ఉపశమనం లభించింది.
ఏపీ లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏ -38గా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇక ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని ఏ -39గా చేర్చారు.