AP News | అనంతపురం జిల్లా గంజాయి మత్తులో రౌడీషీటర్ అజయ్ హల్చల్ చేశాడు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్కిక్కర్తో ఉన్న వాహనంతో నానా హంగామా సృష్టించాడు. గంజాయి మత్తులో ఉన్న అజయ్ యాడి మండల కేంద్రంలో కారును రోడ్డుపై అడ్డంగా పెట్టి, అటువైపు వెళ్తున్న వాహనదారులను బెదిరించాడు.
రౌడీ షీటర్ తీరుతో ఇబ్బంది పడిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రౌడీషీటర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన అతను గంజాయి ప్యాకెట్లు బయటపడేసి, కారులో తప్పించుకునేందుకు చూశారు. కానీ పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అజయ్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.