అమరావతి : ఏపీలో వర్షప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.25లక్షల విరాళం ప్రకటించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులు కోలుకునేందుకు నావంతు చిన్న సాయమని బుధవారం తన ట్విట్టర్లో వెల్లడించారు.
దాదాపు పదిరోజుల పాటు నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. వరదలతో తీవ్ర నష్టం జరిగింది. పంటలు దెబ్బతిన్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే.