దుబాయ్: విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ నమోదు చేశాడు. ఆసియాకప్‌లోని సూపర్-4లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ 122 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆ సెంచరీని భార్య అనుష్కా శర్మ, కూతురు వామికాకు అంకితం ఇస్తున్నట్లు కోహ్లీ చెప్పేశాడు. ఇక అనుష్కా కూడా తన ఇన్‌స్టా గ్రామ్‌లో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నది. విరాట్ ఫోటోను పోస్టు చేసిన ఆమె.. ఎన్నటికీ నీతోనే ఉంటానని ట్యాగ్‌లైన్‌లో పేర్కొన్నది. ఇక కామెంట్ సెక్షన్లో విరాట్ కోహ్లీ హార్ట్ ఎమోజీలను డ్రాప్ చేశాడు. సెంచరీ చేసిన ఆనందంలో.. తన చేతికి ఉన్న రింగును కిస్ చేసినట్లు కోహ్లీ చెప్పాడు. నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే నా వెంటే ఓ వ్యక్తి అండగా ఉన్నారని, అన్ని కష్ట సమయాల్లో తనకు తోడగా ఉన్నారని, అది అనుష్కా అని, ఈ సెంచరీని ఆమెకు అంకితం ఇస్తున్నానని, కూతురు వామికాకు కూడా ఇది చెందుతుందని కోహ్లీ అన్నాడు.