క్వాంటిటీ కన్నా.. క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. దీనివల్ల సినిమాల సంఖ్య తగ్గుతున్నా.. మంచి పాత్రలు ఆమె పరమవుతున్నాయి. రీసెంట్గా ‘రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్’లో అద్భుతమైన పాత్రలో కనిపించి యూత్‌ని ఓరేంజ్‌లో ఆకట్టుకున్నది అనుపమ. ఇదిలావుంటే.. ఇటీవలే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఈ అందాలభామ పచ్చజెండా ఊపేసిందట. ఆ వివరాల్లోకెళ్తే.. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్‌నంది ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ఎంపికైంది. ఇటీవలే అనుపమకు దర్శకుడు సంపత్‌నంది కథ కూడా వినిపించారట, తన పాత్ర బాగా నచ్చడంతో అనుపమ ఓకే చెప్పేసిందట. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ‘శతమానం భవతి’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జంట కలిసి నటిస్తున్నారు. దీనివల్ల సినిమాపై పాజిటీవ్ వైబ్ క్రియేటవ్వడం ఖాయం.