ఆనాడు బ్రిటిషర్లు.. ఈనాడు బీజేపీ పాలకులు
దేశంలో ప్రతిపక్షాలపై అణచివేత ధోరణిని ఎండగడుతూ హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు ఆలోచింప జేస్తున్నాయి. దేశంలో బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు కాషాయ పార్టీని కలవరానికి గురిచేశాయి.
- ప్రతిపక్షాలపై బీజేపీ అణచివేత
- ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.. మహాత్మా కాపాడు’ అంటూ వెలిసిన పోస్టర్లు
- ‘బైబై మోడీ’ అంటూ ఫ్లెక్సీలు
- నగరంలో ఆసక్తిగా తిలకిస్తూ.. చర్చించుకొంటున్న ప్రజలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రతిపక్షాలపై అణచివేత ధోరణిని ఎండగడుతూ హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు ఆలోచింప జేస్తున్నాయి. దేశంలో బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు కాషాయ పార్టీని కలవరానికి గురిచేశాయి. ఆనాడు స్వాతంత్య్ర సమరయోధులను బ్రిటిష్పాలకులు అణచివేస్తే.. ఈనాడు బీజేపీ నాయకులు.. ప్రతిపక్ష నాయకుల నోరు నొక్కుతున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు.
బ్రిటిష్పాలన తరహాలోనే బీజేపీ పాలన ఉందంటూ చురకలంటించారు. పోస్టర్లలో పై వరుసలో నాడు స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మాగాంధీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ నోర్లను బ్రిటిషర్లు నొక్కేసినట్టు.. కింది వరుసలో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ నోర్లను బీజేపీ నొక్కేస్తున్నదని చిత్రీకరించారు. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.. మహాత్మా కాపాడు’ అనే నినాదాలను ముద్రించారు. పోస్టర్ల చివరి భాగంలో ‘బైబై మోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉంచారు. ఈ పోస్టర్లను ప్రజలు, మేధావులు ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశంలో బీజేపీ పాలన బ్రిటిషర్ల పాలనను తలపిస్తున్నదని మండిపడుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

