సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది మహిళలు దీని వలన ఇబ్బందులకు గురయ్యారు. కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేఖంగా మీటూ ఉద్యమం మొదలు కాగా, పలువురు స్టార్స్ తమకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేశారు. తాజాగా దివంగత నటుడు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసి అంకితా లోఖండే సౌత్‌లో తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంకితా మాట్లాడుతూ… సౌత్ నుండి నాకు సినిమా ఆఫర్ రాగా, అక్కడికి వెళ్తే ఓ స్టార్ గదిలోకి పిలిచి కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడు.ఆయన మాటలలో ఏదో తేడా ఉందని అనిపించి, డిన్నర్‌కు వెళదాం అంటున్నారా అని అన్నాను. దీంతో ఆయన మౌనంగా ఉన్నాడు. ఇక షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చేశాను. ఇక ఈ సినిమా ఆఫర్ రాదని నాకు ఆ క్షణమే అర్ధమైంది. అలానే జరిగింది కూడా అంటూ అంకితా పేర్కొంది.