AP News | ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో పనిచేస్తున్న సర్వీస్ టీచర్లకు ‘SPECIAL APTET-2026’ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అర్హులైన ఉపాధ్యాయులు ఈ పరీక్ష కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ సెప్టెంబర్ 24. పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 21 వరకు నిర్వహిస్తారు. తుది కీ నవంబర్ 10న, 15న ఫైనల్ ఫలితాలు వెల్లడిస్తారు.
ఫీజు
ఒక్కో పేపర్‌కు దరఖాస్తు ఫీజు (Fee) రూ. 1000. పేపర్-1, పేపర్-2 రాయాలనుకుంటే రూ. 2000 చెల్లించాలి. ఈ ఫీజును డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. సెప్టెంబర్ 9లోపు ఫీజు చెల్లించాలి.

Aptet
ఎవరు అర్హులు
ఏపీలో 2011కు ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారు అర్హులు. ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లు, గవర్నమెంట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఏపీ మోడల్ స్కూళ్లు, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ టెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం
పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 ప్రశ్నలు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఓసీ/ఈడబ్ల్యూఎస్‌లు 60 శాతం(90 మార్కులు), బీసీలు 50 శాతం (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు, ఎక్స్సర్వీస్మెన్లు 40 శాతం (60 మార్కులు) కనీస ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించారు.