హైదరాబాద్ : తెలంగాణలో నిజమైన, నిజాయితీ ఉద్యమకారులున్నరు. నిజాయితీకి నిలువుటద్దంలాగా ఉద్యమ సమయంలో పార్లమెంట్లో కొట్లాడిన అసలైన కాంగ్రెస్ నాయకులం. తమ లాంటి వ్యక్తులను కించిపరిచే విధంగా కథనాలు రాస్తున్న ఏబీఎన్ ( ABN ), ఆంధ్రజ్యోతి ( Andhra Jyoti ) పత్రికపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Rajagopal Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా
కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది
ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది
మేము అనుకుంటే… pic.twitter.com/aUll54CCgC
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కథనాలు రాస్తే ఇకపై సహించబోమని హెచ్చరించారు. కొందరు వ్యక్తులకు మద్దతు తెలుపుతూ తనలాంటి వారిని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్న ఏబీఎన్ , ఆంధ్రా మీడియా తమకు అవసరం లేదని వెల్లడించారు. మీడియా ముసుగులో తెలంగాణలో తమలాంటి నిజాయితీగల రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నానని అన్నారు.
తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్రా మీడియా మీదా ఆధారపడి తెలంగాణ వ్యక్తులు ఎవరూ పనిచేయడం లేదని వెల్లడించారు. ఏబీఎన్ లాంటి 100 ఛానళ్లు, పేపర్లు పెట్టే శక్తి మాకు ఉంది . తాము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదని హెచ్చరించారు. మీడియా అంటే, జర్నలిస్టులు అంటే గౌరవం ఉందని తమ గురించి ఏబీఎన్ లాంటి పత్రికలు కథనాలు రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలని రాధాకృష్ణకు సూచించారు. ఆంధ్ర మీడియా ఛానళ్తు తమకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.