బూర్గంపహాడ్, ఆగస్టు 26 : యువతిని పెళ్లిపేరుతో గర్భవతిని చేసి మోసం చేసిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై బూర్గంపహాడ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మోరంపల్లిబంజర్కు చెందిన ఓ యువతి సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సాయికుమార్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. అనంతరం అతడు వేరే పెళ్లి చేసుకోవడంతో తనను మోసగించాడని పేర్కొంటూ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.