Maganur | పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ?
Maganur | సంగంబండ రిజర్వాయర్ Sangambanda Reservoir project ముంపునకు గురైన ఉజ్జెల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మాగనూరు : సంగంబండ రిజర్వాయర్ (Sangambanda Reservoir project) ముంపునకు గురైన ఉజ్జెల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురాతన ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు చేపట్టి, అక్కడ ఉన్న శివలింగాన్ని( Shiva Temple ) సైతం పెకలించిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉజ్జెల్లి గ్రామం రిజర్వాయర్ ముంపునకు గురై అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారడంతో కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 3 తేదీన రాత్రి వేళల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
ఆలయ పరిసరాల్లో మట్టి తొలగించడం, రాళ్లు చెల్లాచెదురుగా పడేయడం, పురాతన విగ్రహాలను కదిలించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గుప్త నిధుల పేరుతో పురాతన కట్టడాలను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉజ్జెల్లిలో జరిగిన తవ్వకాలపై రెవెన్యూ, పోలీసు, పురావస్తు శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి, తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

