Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. ఈ తరుణంలో సినిమాపై మరింత హైప్ పెంచేందుకు చిత్ర బృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే.. దర్శకుడు పి. మహేశ్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) రామ్‌ను సరికొత్తగా ఆవిష్కరించిన తీరు ఈ వీడియోలో కనిపిస్తోంది. మేకింగ్ వీడియోలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, భావోద్వేగ సన్నివేశాల కోసం రామ్ తీసుకున్న శ్రద్ధను చూపించారు. రామ్ ఎనర్జీ, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులకు విందు భోజనంలా ఉన్నాయి.