Dhurandhar | బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా, ఉరి చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar). ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుండగా.. ఈ చిత్రం రన్టైమ్కి సంబంధించిన విషయం ఆసక్తిగా మారింది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 3 గంటల 32 నిమిషాలుగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న భారతీయ చిత్రాల్లో ధురంధర్ కూడా ఒకటిగా నిలవనుంది.
మరోవైపు ‘ధురంధర్’ చిత్రం మేజర్ మోహిత్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు ఆదిత్య ధర్ తాజాగా స్పందించాడు. “ఇది ఏ ఒక్కరి బయోపిక్ కాదు. భవిష్యత్తులో మేజర్ మోహిత్ శర్మ గారిపై బయోపిక్ తీయాల్సి వస్తే, వారి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని, అధికారికంగా ప్రకటిస్తాను. దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఆ బయోపిక్‌ను చాలా గౌరవంగా, పద్ధతిగా రూపొందిస్తా. అయితే, ‘ధురంధర్’ చిత్రంలో మాత్రం మేజర్ మోహిత్ శర్మ గారి జీవితాన్ని చూపించలేదు అని ఆదిత్య చెప్పుకోచ్చాడు.