Manchu Lakshmi | కుటుంబ వివాదాలపై స్పందించిన మంచు లక్ష్మీ.. నాకున్న కోరిక ఒక్కటేనంటూ కామెంట్
Manchu Lakshmi |నటి మంచు లక్ష్మి తన కుటుంబంలో ఎదురైన వివాదాలపై ఎమోషనల్‌గా స్పందించారు. సినిమా ప్రచారాల కోసం ఇచ్చే ఇంటర్వ్యూలు తప్ప, వ్యక్తిగత విషయాలని చర్చించడం కోసం తాను ఆసక్తి చూపబోనని స్పష్టం చేశారు.
Manchu Lakshmi |నటి మంచు లక్ష్మి తన కుటుంబంలో ఎదురైన వివాదాలపై ఎమోషనల్‌గా స్పందించారు. సినిమా ప్రచారాల కోసం ఇచ్చే ఇంటర్వ్యూలు తప్ప, వ్యక్తిగత విషయాలని చర్చించడం కోసం తాను ఆసక్తి చూపబోనని స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మంచు లక్ష్మి, తల్లి, సోదరి, కుమార్తెగా తన పాత్రల గురించి వివరించారు. “తల్లిగా నాకు నేను 10కి 10 మార్కులు ఇస్తాను” అని చెప్పి తన అనుభవాన్ని షేర్ చేశారు. ఇక కుటుంబంలో జరిగిన విభేదాల విషయం గురించి, ఆమె మాట్లాడుతూ .. దేవుడు ప్రత్యక్షమై ఒక వరం అడగమంటే, మా కుటుంబం మళ్లీ మునుపటిలాగే ఒక్కటిగా మారాలని మాత్రమే కోరతాను.
ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. అయినా ఎంత విభేదాలు వచ్చినా చివరికి అందరూ కలిసే ఉండాలని మనసులో నిలుపుకోవాలి. భారతీయ కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో, విరిగిపోయిన కలహాలు జీవితాంతం ఉండాలని భావించే ధోరణి ఉంది. అది సరికాదు. చివరికి మనకుండేది రక్తసంబంధీకులే. కుటుంబాన్ని కలిపేందుకు పోరాటం చేయాలి, దూరం పెంచుకోవడం సరైనది కాదు అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు. అలాగే, మంచు లక్ష్మి వ్యక్తిగత బాధలని బయటివాళ్లకు వివరించాల్సిన అవసరం లేదని చెప్పారు. “నేను ముంబయిలో ఉన్నాను. ఇక్కడి పరిస్థితులు తెలిసినా బాధపడలేదని కొందరు వార్తల్లో రాశారు. కానీ నా బాధ నాకు మాత్రమే తెలుసు. వివాదాలపై నేను మాట్లాడకపోవడం వల్ల కొందరు ఊహాగానాలు సృష్టించారు. నా కుటుంబం గురించి నేను అనుకున్నది, ఆ పరిస్థితుల్లో నాకు కలిగిన బాధ బయటివాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో మంచు లక్ష్మి వ్యక్తిగత ప్రైవసీ, కుటుంబ విలువలను ఎంతో స్పష్టంగా రుజువుచేసారు. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి తొలి సినిమాతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అంతకుముందు కొన్ని ఇంగ్లిష్ సీరియల్స్, టీవీషోస్ లోనూ కనిపించి సందడి చేసింది. దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట, గుంటూర్ టాకీస్, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, మా వింత గాథ వినుమా, పిట్ట కథలు, మాన్స్టర్ (మలయాళం) వంటి సినిమాల్లో నటిగా తన సత్తా చాటింది. ఇప్పటికి అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

