గాలె: తమ టెస్టు క్రికెట్లో 600వ మ్యాచ్‌ను భారత్ మధుర జ్ఞాపకంగా మార్చుకుంది. శ్రీలంకతో జరిగిన ఈ చారిత్రక మ్యాచ్‌లో భారీ విజయం అందుకుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో పెద్దగా అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా అన్ని విభాగాల్లో అదరగొట్టి లంకను జయించింది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (6/55) ఖతర్నాక్ బౌలింగ్‌తో 165 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. 372 లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 84/4తో ఐదో రోజు, బుధవారం ఛేదన కొనసాగించిన ఆతిథ్య జట్టు 77.4 ఓవర్లలో 206 పరుగులకే కుప్పకూలింది. సోనల్ దినుషా (84), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (59) మాత్రమే పోరాడారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టిన సుతార్ లంక వెన్ను విరిచాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో గిల్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం కొట్టిన దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కొలంబోలో ఆదివారం మొదలవుతుంది.
తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన మానవ్ సుతార్, రెండో ఇన్నింగ్స్‌లో మరో 6 వికెట్లతో చెలరేగి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. అఫ్గానిస్థాన్‌పై అరంగేట్ర టెస్టులోనూ ఐదు వికెట్ల హాల్ సాధించిన సుతార్‌కు ఇది వరుసగా రెండో ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఆఖరి రోజు ఉదయం లంక కెప్టెన్ ధనంజయ, తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు దినూషా అద్భుత పోరాట పటిమ చూపెట్టారు. భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గిల్‌సేనకు సవాలు విసిరారు. అయితే డ్రింక్స్ బ్రేక్ తర్వాత జడేజా చురుకైన బౌలింగ్‌తో ధనంజయను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. జడేజా ఎక్స్ట్రా బౌన్స్‌తో వేసిన బంతికి లంక కెప్టెన్ షార్ట్ ఫైన్ లెగ్‌లో సుతార్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన నిరోషన్ డిక్వెలా (10) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లోకీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో నువంతా (20) తోడుగా దినుషా 175/6తో లంకను లంచ్‌కు తీసుకెళ్లాడు. విరామం తర్వాత ఈ ఇద్దరూ రక్షణాత్మకంగా ఆడుతూ వర్షం పడేవరకు వికెట్ కాపాడుకోవాలని చూశారు. ఓ దశలో ఆ జట్టు 199/6తో నిలిచింది. అయితే సుతార్ మళ్లీ బౌలింగ్‌కు దిగడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. 76వ ఓవర్లో సుతార్ దినుషాతో పాటు ప్రభాత్ జయసూర్య (0), లహిరు కుమార (0)ను ఔట్ చేసి భారత్ విజయం ఖాయం చేశాడు. శతకం దిశగా సాగిన దినుషా లెగ్ స్టంప్‌పై పిచ్ అయిన బాల్‌ను వెంటాడి జురెల్‌కు క్యాచ్ ఇవ్వగా.. ప్రభాత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లాహిరు.. కీపర్ పంత్‌కు చిక్కాడు. తన తర్వాతి ఓవర్లోనే నువంతాను బౌల్డ్ చేసిన సుతార్ మ్యాచ్ ముగించడంతో భారత ఆటగాళ్ల సంబరాలు మొదలయ్యాయి. ఆట ముగిసిన సాధించిన కొన్ని నిమిషాలకే గాలె మైదానంలో వర్షం మొదలవడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఊపిరి పీల్చుకున్నాడు.
188/600 : ఇప్పటిదాకా ఆడిన 600 టెస్టుల్లో భారత్‌కు ఇది 188వ విజయం. అత్యధిక టెస్టు విజయాలు సాధించిన నాలుగో జట్టుగా నిలిచింది. భారత్ తన 300, 400, 500, 600వ టెస్టుల్లో గెలవడం విశేషం.
10/131 : శ్రీలంక గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా సుతార్ నిలిచాడు. హర్భజన్, (2008), అశ్విన్ (2015) తర్వాత లంకలో పది వికెట్లు సాధించిన
మూడో బౌలర్‌గా, కెరీర్ రెండో టెస్టులోనే 10 వికెట్ల హాల్ సాధించిన నాలుగో బౌలర్‌గానూ నిలిచాడు.
మహ్మద్ నిస్సార్ తర్వాత తన మొదటి హోమ్, అవే టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత రెండో బౌలర్ సుతార్.
శ్రీలంక గడ్డపై భారత్‌కు ఇది వరుసగా ఆరో టెస్టు విజయం.
భారత్ తొలి ఇన్నింగ్స్: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 284; భారత్ రెండో ఇన్నింగ్స్: 193;
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 372): 77.4 ఓవర్లలో 206 ఆలౌట్ (దినుషా 84, ధనంజయ 59, సుతార్ 6/55)