హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీటీడీకి రూ.27.5 కోట్ల విలువ చేసే 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందజేస్తామని అనం త్ వెల్లడించారు. తిరుమల గోశాలను ఆధునీకరించేందుకు సహకారం అందిస్తామని ప్రకటించారు.